drone on the office of the Janasena is the government.

జనసేన కార్యాలయంపై డ్రోన్‌ ప్రభుత్వానిదే..!

అమరావతి: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చెందిన డ్రోన్‌గా గుర్తించిన పోలీసులు.. సర్వేలో భాగంగానే కార్యాలయంపై డ్రోన్ ఎగిరినట్లు తేల్చారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ డ్రోన్ ప్రభుత్వానిదేనని తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో అధ్యయనం చేస్తుండగా.. పలు రకాల సర్వేలకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.

image

మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతకు సంబంధించి ప్రతీ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం పెట్రోల్ బంకును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. మన్యంలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని పేర్కొన్నారు. ‘పోలీసుల సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ బంకుల్లో కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుని పోలీస్ శాఖకు సహకరించాలి. గతం కంటే ఈసారి కోడి పందేలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. పందేలకు సంబంధించిన కేసులైతే ఎక్కువగానే నమోదు చేశాం.’ అని పేర్కొన్నారు.

కాగా, మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై శనివారం డ్రోన్ ఎగిరింది. ఈ మేరకు పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి టౌన్ సీఐ వినోద్ ఘటన జరిగిన రోజునే జనసేన కార్యాలయంలో సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. రెండ్రోజుల లోతైన దర్యాప్తు అనంతరం అది ప్రభుత్వానికి చెందిన డ్రోన్‌గా గుర్తించారు.

Related Posts
రోడ్డుపై బైఠాయించి ..బండి సంజయ్ నిరసన, గ్రూప్ 1 అభ్యర్థులకు బీజేపీ భరోసా
Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 అభ్యర్థుల కష్టాలకు Read more

బీజేపీ నేత వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం ఆగ్రహం
బీజేపీ నేత వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం ఆగ్రహం

బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఈ రోజు తీవ్రంగా స్పందించారు. రమేష్ బిధూరి తన తండ్రిని దూషించినట్లుగా ఆమ్ Read more

ఇప్పట్లో తల్లికి వందనం లేనట్టేనా!
talliki vandanam

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లికి వందనం పథకం అమలు ఇప్పట్లో లేదని తెలుస్తున్నది. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కారణం.. తల్లికి వందనం Read more

రియల్‌మి GT 7 ప్రో ప్రీ-ఆర్డర్ వివరాలు: 18 నవంబర్ నుంచి ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభం
realme GT 7 pro

రియల్‌మి తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ GT 7 ప్రోను భారత్‌లో నవంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ విడుదలకు ముందు రియల్‌మి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *