ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.ముఖ్యమంత్రి ఆతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది.వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో.. అరవింద్ కేజ్రీవాల్– న్యూఢిల్లీ, అతిషి- కల్కాజీ, మనీష్ సిసోడియా- జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్- రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్- బాబర్‌పూర్, మనోజ్ త్యాగి- కరావల్ నగర్, అనిల్ ఝా- కిరారీ, దినేష్ మొహానియా – సంగం విహార్, వినయ్ మిశ్రా- ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థలు ఉన్నారు. ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు.
ముఖ్యమంత్రి ఆతిషి :
మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది. వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో అరవింద్ కేజ్రీవాల్ – న్యూఢిల్లీ, అతిషి – కల్కాజీ, మనీష్ సిసోడియా – జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్ – రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్ – బాబర్‌పూర్, మనోజ్ త్యాగి – కరావల్ నగర్, అనిల్ ఝా – కిరారీ, దినేష్ మొహానియా – సంగం విహార్, వినయ్ మిశ్రా – ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థులు ఉన్నారు.ఈ పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఘాటు విమర్శలు సంధించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు పట్ల అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ఆయన సమర్థించారు. ఆయన అభిప్రాయాన్ని బలపరుస్తూ, ఈ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీజేపీ విజయానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా హిందూత్వ ప్రచారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ ప్రభావం, ఢిల్లీ ప్రజల వైఖరి వంటి అంశాలు బీజేపీకి అనుకూలించాయని విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా, ఆమ్ ఆద్మీ పార్టీపై జరుగుతున్న దర్యాప్తులు, అరెస్టులు, విపక్షాల మధ్య ఐక్యత లోపం వంటి అంశాలు కూడా ఆప్ పరాజయానికి దోహదపడ్డాయని అభిప్రాయపడుతున్నారు.
ఒక్కప్పుడు ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆప్, ఈ ఎన్నికల్లో వెనుకబడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీకి గణనీయమైన ఓట్లు రావడం లేదని ఫలితాలు చెబుతున్నాయి. ఇది కాంగ్రెస్ నాశనం వైపు మరో అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.