‘డబుల్ ఇస్మార్ట్’ టాక్

. డాషింగ్ డైరెక్టర్ పూరి – హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. రామ్ కెరియర్ లోనే భారీ హిట్ అయ్యింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న రామ్ – పూరి లకు ఈ మూవీ ఊపిరి పోసింది. ఈ మూవీ తర్వాత పలు ప్లాప్స్ అందుకున్న పూరి – రామ్ లు చాల గ్యాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ అంటూ ఈరోజు ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ తో సినిమా ఫై అంచనాలు పెరిగిపోవడం తో…సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి పెరిగింది.

గురువారం తెల్లవారుజామునే డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఆడియెన్స్​ రాకతో హైదరాబాద్​లోని పలు థియేటర్లలో సందడి నెలకొంది. ఇక ఈ సినిమాకు అంతటా ప్రీమియర్స్​ నుంచి పాజిటివ్ రివ్యూ వస్తోంది. హీరో రామ్ క్యారెక్టరైజేషన్, పూరి మార్క్ డైరెక్షన్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ సినిమాకు ప్లస్​గా మారిందట. రామ్ ఎనర్జీ, డ్యాన్స్​లు, ఎంటర్టైనింగ్​ డైలాగులు, సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. స్టెప్పా మార్, మార్ ముంత పాటలతో ఆడియెన్స్​కు మంచి హైప్ ఇచ్చారంట. అయితే సినిమాలో బీజీఎమ్ (BGM) అంతగా ఆకట్టుకోదలని టాక్. అలీ కామెడీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్ ప్లే కూడా కాస్త నిరాశ పర్చాయని అంటున్నారు. చిన్న చిన్న అంశాలు మినహా, ఓవరాల్​గా సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు.