Dont fly Air India from November 1 19. Khalistani terrorist Pannuns new threat

నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు పన్నున్ హెచ్చరిక

న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ప్రయాణికులను హెచ్చరించాడు. గతేడాది కూడా అతడు ఇలాంటి హెచ్చరికనే జారీచేశాడు.

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు అయిన పన్నున్‌కు అమెరికా, కెనడా రెండు దేశాల పౌరసత్వం ఉంది. సిక్కుల ఊచకోత జరిగి 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆయనీ హెచ్చరికలు జారీచేశాడు. ఆ విమానాల్లో ప్రయాణించి ప్రమాదం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించాడు. ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరగొచ్చని పేర్కొన్నాడు.

కాగా, గత కొన్ని రోజులుగా పలు విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. నిన్న కూడా 25 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఇందులో ఉన్నాయి. ఈ వారంలో 90కిపైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. వరుస బెదిరింపుల నేపథ్యంలో విమనాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Related Posts
న్యూఢిల్లీలో పెరిగిన విషవాయువు:ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు
pollution 1

న్యూఢిల్లీ నగరంలో విషవాయువు మరింత పెరిగి, వాయు గుణాత్మక సూచిక (AQI) 414 కు చేరుకుంది. ఇది భారీ స్థాయికి చేరుకున్నది. ఈ రేటింగ్ వలన ప్రజల Read more

న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ -న్యుమోషీల్డ్ 14 ఆవిష్కరణ
Invention of Pneumococcal C

హైదరాబాద్ 2024 : ఆరు వారాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం న్యూమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్ న్యుమోషీల్డ్ 14ను ఆవిష్కరించినట్లుగా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ Read more

నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం
Hydra team going to Bangalore today

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో Read more

సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!
CM Chandrababu held meeting with TDP Representatives

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రను సందర్శిస్తున్నారు. నిన్న దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. అయితే ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *