suprem court

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం అటవీ (సంరక్షణ) చట్టంలో చేసిన సవరణల కారణంగా 1.97 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి అటవీ ప్రాంతం నుండి మినహాయించబడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏదైనా ముఖ్యమైన పనికి అటవీ భూమిని ఉపయోగించాల్సి వస్తే, చెట్లను నాటడానికి ఇతర భూమిని అందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏదీ అనుమతించబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, అటవీ భూమి తగ్గింపుకు దారితీసే ఎటువంటి చర్యను భారత ప్రభుత్వం లేదా ఏ రాష్ట్రం తీసుకోకూడదని ఆదేశిస్తున్నాము’ అని ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్, న్యాయవాది కౌశిక్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెట్ల సంఖ్యను పెంచడానికి ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించిందని, అయితే అది భారతదేశ అటవీ విస్తీర్ణానికి చాలా హానికరం అని అన్నారు.

Related Posts
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం – విజయసాయి రెడ్డి
polavaram

వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పలు అంశాలను ప్రస్తావిస్తూ, పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు Read more

నవంబర్ 19 వరకు ఎయిరిండియాలో ప్రయాణించొద్దు.. ఖలిస్థానీ టెర్రరిస్టు పన్నున్ హెచ్చరిక
Dont fly Air India from November 1 19. Khalistani terrorist Pannuns new threat

న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నున్ మరో హెచ్చరిక జారీ చేశాడు. నవంబర్ 1 నుంచి 19 మధ్య Read more

‘ఫీల్ గుడ్ విత్ ఫియామా’.. మెంటల్ వెల్‌బీయింగ్ సర్వే 2024..
Feel good with Fiama

సమీక్షకు స్పందించిన వారిలో 83% మంది మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడేందుకు సంకోచపడే అవసరం లేదని భావిస్తుండగా, 81% మంది తాము చికిత్స తీసుకుంటున్నామని ఇతరులకు చెప్పడానికి Read more

ICC అరెస్ట్ వారెంట్లు: ఇజ్రాయెల్ ప్రధాని, మంత్రి, హమాస్ చీఫ్‌పై నేరాల ఆరోపణలు
arrest warrant

అంతర్జాతీయ నేరన్యాయమాన్య కోర్టు (ICC) ఈ గురువారం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మరియు మాజీ రక్షణ మంత్రి యోవ్ గలాంట్ పై "మానవ హక్కుల ఉల్లంఘన" Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *