tirumala brahmotsavam 2024

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే అర్చకులు ఎగుర వేయాల్సి ఉంది. అర్చకులు ఈ కొక్కిని ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. కాగా తొమ్మిది రోజుల పాటు ధ్వజస్తంభంపై ఈ గరుడ పతాకాన్ని ఉంచుతారు. బ్రహ్మోత్సవాల ముగింపు చిహ్నంగా చివరి రోజు పతాకాన్ని అవనతం చేస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు నిర్వహించే పెద్దశేష వాహన సేవతో వాహన సేవలు మొదలవుతాయి. వైదిక కార్యక్రమాలన్నింటినీ శాస్త్రోక్తంగా నిర్వహించేలా టీటీడీ చర్యలు చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.20 గంటలకు సీఎం చంద్రబాబు తిరుమల చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు టీటీడీ డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించి, వకుళమాత వంటశాలను ప్రారంభిస్తారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు నేడు మీన లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానం పలుకుతూ ధ్వజ పటం ఎగురవేస్తారు. దీంతో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవతో శ్రీవారి వాహన సేవలు మొదలవుతాయి. అక్టోబర్ 11న ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రికి అశ్వ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. 12న శ్రీవారి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు జరిగే స్నపన తిరుమంజనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Related Posts
హైదరాబాద్ వాసుల మృతి
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – ఏడుగురు తెలుగువారు దుర్మరణం

తెలుగు యాత్రికులు ప్రయాగరాజ్ లో కుంభమేళా కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణిస్తున్న మినీ బస్సు ను లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్ లో Read more

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి – జగన్
jagan tpt

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Read more

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం
ISRO NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం

ISRO-NASA ప్రాజెక్టు ఖరీదైన ఉపగ్రహం ప్రతి 12 రోజులకు దాదాపు భూమి మొత్తం మరియు మంచును స్కాన్ చేస్తుంది, అలాగే ఇది అధిక రిజల్యూషన్ కలిగి ఉంటుంది. Read more

భారతదేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ సంస్థను ఎందుకు స్థాపించలేదు?
public policy school

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ దేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ పాఠశాలలను స్థాపించలేకపోయింది. అమెరికా మరియు యూరోప్ దేశాలు జాన్ ఎఫ్. Read more