శ్రీవారిని దర్శించుకున్న కొరటాల శివ

దేవర దర్శకుడు కొరటాల శివ తిరుమల శ్రీవారిని ఈరోజు సతీసమేతంగా దర్శించుకున్నారు. దర్శనానికి వారు మెట్లెక్కి వెళ్లడం విశేషం. ఆయన వెళ్తున్న సమయంలో మెట్లపై కొంతమంది తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత తీసిన దేవర మూవీ విజయం కొరటాలకు కీలకం. ఈ నెల 27న ఆ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సక్సెస్ ను కోరుతూ ఆయన మొక్కు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది.

జూ. ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, పాటలు, టీజర్ ఇలా ప్రతిదీ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. మరోపక్క మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను భారీగా చేస్తూ సినిమా ఫై మరింత ఆసక్తి నింపుతున్నారు. నిన్న ఈ మూవీ నుండి ఆయుధపూజ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు.