నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కాగా ఈ మూవీ లో ని ‘దబిడి దిబిడి’ సాంగ్లో బాలయ్య స్టెప్పులపై డైరెక్టర్ బాబీ స్పందించారు. ‘బాలయ్య ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వరు. డైరెక్టర్ కొరియోగ్రాఫర్ ఏం చెప్తే అది చేస్తారు. మేము కూడా సర్ప్రైజ్ అయ్యాం. అనంత్ శ్రీరామ్ రాసిన చిన్ని చిన్ని సాంగ్కు కేవలం 3M వ్యూస్ వచ్చాయి. దబిడి సాంగ్ 13Mతో దూసుకెళ్తాంది. తొలి రెండు రోజులు ట్రోల్స్ రాగా.. తర్వాత ఫ్యాన్స్కు ఆ సాంగ్ తెగ నచ్చేసింది’ అని చెప్పుకొచ్చారు.