flight

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక థాయ్‌లాండ్ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి థాయ్‌లాండ్‌కు నేరుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు ప్రారంభించారు. శంషాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరానికి తొలి డైరెక్ట్ ఫ్లైట్ శుక్రవారం (జనవరి 31) బయలుదేరింది. ఈ విషయాన్ని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కొత్త ఎయిర్ ఇండియా సర్వీసు ద్వారా థాయ్‌లాండ్ లోని ఫుకెట్ – హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ప్రదీప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫ్లైట్ 3.45 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంటుందని వెల్లడించారు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ సర్వీసులు ప్రస్తుతం వారంలో ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో నడుస్తాయని చెప్పారు. ఈనెల 15 నుంచి వారానికి ఆరు విమానాలకు పెంచుతామని ప్రదీప్ తెలిపారు. హైదరాబాద్ – ఫుకెట్ మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిన మొదటి విమానయాన సంస్థగా నిలవడం సంతోషంగా ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ వెల్లడించారు.
సాధారణ రోజుల్లో విమాన టికెట్‌ రూ.7 వేలు ఉండగా… ప్రస్తుతం రూ.20వేల వరకు ఉంది. ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాకు హైదరాబాద్ నుంచి విమానసర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విమాన సర్వీసుల టికెట్ ధరలను పరిశీలిస్తే.. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు కనిష్ఠంగా రూ.20,552 నుంచి రూ.33,556 వరకు టికెట్ ధరలు ఉన్నాయి. ఈ ధరలకు అదనంగా ట్యాక్సులు ఉంటాయని తెలిపారు. కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు భోజనం, టిఫిన్ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి.

Related Posts
తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం – జేపీ నడ్డా
JP Nadda

తెలంగాణలో మార్పు చేయగల శక్తి బీజేపీదేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు Read more

పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
Employment of Disabled and

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేసింది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డుపై Read more

మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత
ex mp jagannadham dies

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పాలమూరు Read more

సంతానం లేని వారికి గుడ్ న్యూస్..తెలిపిన తెలంగాణ సర్కార్
Telangana government announ

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన మెడిసిన్, పరికరాలను కొనుగోలు చేయాలని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *