మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశమై ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కూడా కలిసి ఆహ్వానించారు.
ఈ భేటీలో ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి సైతం రాబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి దేవిశ్రీ ప్రసాద్ ఆహ్వానించారు.