ముంబైలో ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..?

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తూ వస్తున్నాయి. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.