రిలీజ్ కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’

జూ. ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో ఎన్టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు.