సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవర’

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..నిన్న మంగళవారం విడుదలైన ట్రైలర్ మరింత అంచనాలు పెంచేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటె తాజాగా మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ను హృతిక్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.