‘దేవర‘ ఆయుధ పూజ వచ్చేస్తుంది

జూ. ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్, పాటలు, టీజర్ ఇలా ప్రతిదీ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో రేపు ‘ఆయుధ పూజ’ అనే పాటను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సంబంధించి వరుసగా ట్వీట్లు చేస్తూ హైప్ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు.

‘ఆయుధ పూజ’ పాటను రేపు(సెప్టెంబర్ 19)న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 11.07 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పాట విడుదల అవుతుందా? అని ఎదరుచూస్తున్నారు. ఈ పాటను హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లో షూట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ డ్యాన్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్​తో తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.