pawan durgamma

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు స్వాగతం పలికారు. సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లలో ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈరోజు టికెట్ దర్శనాలను నిలిపేసిన అధికారులు తెల్లవారుజాము నుంచి సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Related Posts
ట్రంప్ విజయం అనంతరం నెతన్యాహూ అభినందనలు
netanyahu

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం ప్రకటించిన వెంటనే, ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహూ ఆయనకు అభినందనలు తెలిపారు. ట్రంప్ విజయాన్ని స్వీకరించిన Read more

బాలికపై అత్యాచారం.. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్థులు
The girl was raped.. The vi

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలో ఓ బాలికపై జరిగిన అత్యాచారం, ఆ తర్వాత గ్రామస్థులు Read more

ఏపీలో మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
ap10thexams

ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపింది. Read more

భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం
bcm

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజామున స్వామివారి ఉత్తర ద్వారం భక్తుల దర్శనార్థం తెరవడం ద్వారా మహోత్సవాలకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *