Deputy CM Pawan Kalyan key comments on the volunteer system

వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు.

వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని, కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదో సాంకేతిక సమస్య అని పవన్ చెప్పుకొచ్చారు. దీంతో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకుండా ప్రభుత్వం ఎందుకు పక్కనబెట్టేస్తోందో అన్న చర్చకు పవన్ స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందో చూడాల్సి ఉంది.

మరోవైపు ఏపీలో గత వైస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్దను కొనసాగిస్తామని ఎన్నికల్లో చెప్పిన కూటమి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మాత్రం వారిని పట్టించుకోవడం లేదు. వాలంటీర్ల సేవల్ని తీసుకోకుండా పక్కనబెట్టిన కూటమి సర్కార్.. వారికి జీతాలు కూడా చెల్లించడం లేదు. దీనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ ల సంఘాలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని వెనుక ఉన్న అసలు కారణం చెప్పారు.

Related Posts
అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!
High prices

ప్రజల ఆదాయంలో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, మాంసం వంటి అన్ని నిత్యావసరాలు కొండెక్కాయి. రాష్ట్రంలోని సాధారణ కుటుంబాలకు Read more

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో
బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో

ఫిబ్రవరి 5 ఢిల్లీ ఎన్నికల కోసం బిజెపి తన మ్యానిఫెస్టోలో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేసింది, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ప్రతి గర్భిణీ స్త్రీకి Read more

మావోయిస్టు కీలక నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు
Police Arrests Maoist Prime Leader Sujatha in Kothagudem

ఖమ్మం: వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం Read more

శ్వేతపత్రాలపై ఏం చేశారు…? అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
New law in AP soon: CM Chandrababu

అధికారంలోకి వచ్చి రాగానే చంద్రబాబు ..గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పత్రాల్లో అనేక అంశాలను ప్రస్తావించి వీటిపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *