Delhi's AQI crosses the 421 mark

ఢిల్లీలో 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది. దీనితో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలోకి చేరింది. దీనికి తోడు చలి తీవ్రత కూడా పెరిగి, ఈ సీజన్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ వాసులు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రకారం, ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పరిగణించబడింది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో AQI లెవల్స్ 421గా నమోదయ్యాయి.

నగరంలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో 26 స్టేషన్లు 400 మార్క్‌ను దాటాయి. ముఖ్యంగా జహంగీర్‌పురి 466, ఆనంద్ విహార్ 465, బవానా 465, రోహిణి 462, లజ్‌పత్ నగర్ 461, అశోక్ విహార్ 456, పంజాబీ భాగ్ 452తో అత్యధిక స్థాయిలో గాలి కాలుష్యాన్ని నమోదు చేశాయి. ఎయిర్ క్వాలిటీ సూచిక ప్రకారం, AQI 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని, 51-100 మధ్య సంతృప్తికరమని, 101-200 మధ్య మితమైన నాణ్యత అని, 201-300 మధ్య తక్కువ నాణ్యత అని, 301-400 మధ్య చాలా పేలవమైనదని, 401-500 మధ్య ప్రమాదకరంగా పరిగణిస్తారు.

కాగా, కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, గాలి నాణ్యత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాప్ 4 ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీనిలో భాగంగా డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించాయి.

Related Posts
జగన్ కు రాజకీయ పార్టీ అవసరమా..? – టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి సూటి ప్రశ్న
jagan gurla

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కఠినంగా విమర్శలు చేశాడు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం Read more

వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు
Another case registered against Vallabhaneni Vamsi

పలు స్టేషన్లలో మూడు కేసులు నమోదు అమరావతి: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలు, దందాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత Read more

బీజేపీలో చేరిన 8 మంది ఆప్‌ మాజీ ఎమ్మెల్యేలు
8 former AAP MLAs joined BJP

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 Read more

హైదరాబాదులో విప్రో విస్తరణ.. భారీగా ఉద్యోగాలు
wipro

రెండు రోజుల కింద టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధులు దావోస్ వేదికగా హైదరాబాదులో తమ కార్యకలాపాలను రానున్న నెలలో విస్తరించటం ద్వారా Read more