ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

ఢిల్లీ ఘటనపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రాత్రి, పగలూ అని తేడా లేకుండా స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ ఐఏఎస్‌ కోచింగ్ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు ప్రవేశించడంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందటే డ్రైనేజీ సమస్య ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద ముంచెత్తిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వరద ఒక్కసారిగా రావూస్ అకాడమీ భవన సెల్లార్‌ను ముంచెత్తింది. దీంతో ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక చనిపోయారు. కాసేపట్లోనే వరద నీరు ఏడు అడుగుల మేర సెల్లార్‌లో చేరిందని ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు రెండు రోజులుగా నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు.

రాత్రి, పగలూ అని తేడా లేకుండా స్టూడెంట్స్ నిరసన తెలుపుతున్నారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. కాగా భారీ వరదలతో ఢిల్లీలోని ‘రావూస్’ IAS కోచింగ్ సెంటర్ సెల్లార్లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు చెందిన యువతి తాన్యా ఉన్నారు. యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళనతో రాజేంద్ర నగర్ లో సెల్లార్లలో ఉన్న 13 లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లను ఎంసీడీ అధికారులు సీజ్ చేశారు. రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినెటర్ దేశ్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. అభిషేక్ గుప్త దేశ్ పాల్ సింగ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.