ఢిల్లీ మద్యం పాలసీ కేసు..పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

Delhi Liquor Policy Case..Kavitha withdrew the petition
Delhi Liquor Policy Case..Kavitha withdrew the petition

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత తాను దాఖలు చేసిన డిఫాల్ట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రెగ్యులర్ బెయిల్ రాకపోవడంతో ఆ తర్వాత డిఫాల్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే కవిత ఈరోజు పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం.

ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌ను ఉపసంహరించకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు. చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, అందుకే ఉపసంహరించుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

సీబీఐ ఛార్జీషీట్‌లో తప్పులు ఉన్నాయని పేర్కొంటూ జులై 6న కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే అందులో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు న్యాయస్థానం జులై 22న తెలిపింది. ఈ ఛార్జిషీట్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది.