Delhi Elections.. 33.31 percent polling till 1 hour

ఢిల్లీ ఎన్నికలు..1 గంట వరకూ 33.31శాతం పోలింగ్‌..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట వరకూ 33.31 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Advertisements
image

ఈసీఐ వివరాల ప్రకారం..అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్‌లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలో అత్యల్పంగా 29.74 శాతం పోలింగ్ నమోదైంది. సౌత్ వెస్ట్ జిల్లాలో 35.44 శాతం, న్యూఢిల్లీలో 29.89 శాతం, ఈస్ట్ 33.66 శాతం, నార్త్ 32.44 శాతం, న్యూఢిల్లీ 29.89 శాతం, ఈస్ట్ 33.36 శాతం, నార్త్ 32.44 శాతం, నార్త్ వెస్ట్ 33.17 శాతం, షహదర 35.81 శాతం, సౌత్ 32.67 శాతం, సౌత్ ఈస్ట్ 32.27 శాతం, వెస్ట్ 30.89 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు పార్టీల నేతలు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు, మిల్కిపూర్‌ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు రికార్డు స్ధాయిలో 44.59 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గం ఉప ఎన్నికలో 42.41 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోడ్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Related Posts
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన

జెనీవాలో జరిగిన UN మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం భారతదేశం తీవ్రంగా తప్పుబట్టింది. భారతదేశం ఈ ఆరోపణలకు దీటుగా Read more

జగన్ అసెంబ్లీకి వెళ్లడంపై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ
jagan mirchi

గుంటూరు మిర్చి యార్డు పర్యటన సమయంలో వైసీపీ అధినేత జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ రాజ్యసభ Read more

గీత కులాలకు ఏపీ సర్కార్ తీపి కబురు
geetha kulalu liquor shop l

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం గీత కులాల సంక్షేమం కోసం పెద్ద బాసట గా భావించబడుతోంది. జిల్లాల వారీగా Read more

వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
ys bhaskar reddy

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దుచేయాలన్న సీబీఐ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు Read more

×