Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

మంత్రి పై ప‌రువు న‌ష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున

హైదరాబాద్‌: త‌న కుటంబం వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు ఇవాళ విచారించింది. నాగ్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాది వాద‌న‌లు వినిపించారు.

అనంత‌రం మంగ‌ళ‌వారం పిటిష‌న‌ర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామ‌ని న్యాయ‌స్థానం తెలిపింది. దీంతో రేపు ఆయ‌న కోర్టులో హాజ‌రుకానున్నారు. నాగ్‌తో పాటు సాక్షుల వాంగ్మూలాల‌ను కూడా న‌మోదు చేయాల‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం రేప‌టికి వాయిదా వేసింది.

ఇదిలాఉంటే.. స‌మంత‌-నాగ‌చైత‌న్య విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. మంత్రి వ్యాఖ్య‌లు త‌మ కుటుంబ ప‌రువుకు భంగం క‌లిగించాయ‌ని ఆమెపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త గురువారం మంత్రి సురేఖ‌పై ప‌రువున‌ష్టం దావా వేశారు.

Related Posts
అమెరికాలో విపత్తులో భారీ నష్టం
అమెరికాలో విపత్తులో భారీ నష్టం

లాస్ ఏంజిల్స్ అడవి మంటలు, అమెరికాలోని అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా మారాయని బ్లూమ్బెర్గ్ ప్రాథమిక ఆర్థిక అంచనాలను ఉటంకిస్తూ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ మంటలు Read more

విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. అమెరికా వెల్లడి..!
A total of 67 people died in the plane crash.. America revealed.

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని Read more

జాతీయ పత్రికా దినోత్సవం: ప్రజాస్వామ్య విలువలను కాపాడే పత్రికలు
national press day 1

ప్రతి సంవత్సరం నవంబర్ 16న జరుపుకునే జాతీయ పత్రికా దినోత్సవం, భారత పత్రికా మండలి (PCI) స్థాపనను గుర్తించేందుకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. 1966లో స్థాపించిన Read more

రేవంత్ రెడ్డికి శుభవార్త చెప్పిన స‌త్య నాదెళ్ల‌
revanth reddy, satya nadella

ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుకు దూసుకుని వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్లతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *