Defamation case..Bail for Rahul Gandhi

పరువు నష్టం కేసు..రాహుల్ గాంధీకి బెయిల్

న్యూఢిల్లీ: విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.

Advertisements
image
image

అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణకు తాజాగా రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. దీంతో ఆయనకు కోర్టు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రాహుల్‌కు పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్‌ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. రాహుల్ ఈ కేసుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదు. అయితే కోర్టు రాహుల్‌కు శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు లాయర్ మిలింద్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

కాగా, 2023లో లండన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ – హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్నేహితులతో కలిసి ఓ ముస్లీం యువకుడిని చితకబాది ఆనందించానని స్వయంగా సావర్కర్‌ తన పుస్తకంలో రాసుకున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని, ఊహాజనిత ఆరోపణలు అని సావర్కర్‌ మనుమడు సాత్యకి సావర్కర్‌ రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా వేశారు. రాహుల్‌ ఉద్దేశపూర్వకంగా సావర్కర్‌ ప్రతిష్ఠను దిగజార్చేందుకు పదేపదే యత్నిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.

Related Posts
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Srivari Arjitha Seva tickets will be released tomorrow

తిరుమల: రేపు (బుధవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, Read more

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు.. !
Chevireddy Bhaskar Reddy will be accused in the High Court.

అమరావతి : వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని Read more

రూ.80,500 కోట్ల అప్పు చేశారు.. అప్పు తప్పు అన్నోళ్లని దేనితో కొట్టాలి?: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల Read more

Ponnam Prabhakar: ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా లేదు : మంత్రి పొన్నం
opposition does not even have the slightest responsibility .. Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని Read more

×