deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో ఉన్న సాక్షులు చనిపోవడం కచ్చితంగా అనుమానాస్పదమే అంటూ బాంబ్‌ పేల్చారు. తన తండ్రి వైఎస్‌ వివేకా హత్య జరిగి ఆరేళ్లైనా నిందితులందరూ బయటే తిరుగుతున్నారని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఆగ్రహించారు. ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు.

Advertisements
మా నాన్న కేసులో సాక్షులు

మళ్లీ సీబీఐ విచారణ మొదలు

నాన్న హత్యకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదు. నిందితుల కంటే మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని, సీబీఐ మళ్లీ విచారణ మొదలుపెడుతుందని ఆశిస్తున్నా అంటూ వైఎస్ సునీతా రెడ్డి తెలిపారు. దీనిపై ఏపీ సర్కార్‌ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈరోజు వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.

టీడీపీపై ఆరోపణలు

కాగా, 2019 మార్చి 15న తెల్లవారుజామున పులివెందులలోని నివాసంలో వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. టీడీపీపై ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాక.. వివేకా హత్య కేసును జగన్ అంతగా పట్టించుకోలేదు. వివేకా హత్య కేసుపై నాటి జగన్ సర్కారు ఫోకస్ చేయకపోవడంతో వివేకా కుమార్తె సునీతకు అనుమానం వచ్చింది. వైఎస్ సునీతారెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. దీనికి ఏపీ హైకోర్టు అంగీకారం తెలిపింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ జరుగుతోంది. సీబీఐ విచారణ మొదలయ్యాకే.. వివేకాది గుండెపోటు కాదని హత్య అని తేలింది.

Related Posts
USA: అణ్వాయుధాలను తమ దేశంలో మోహరించాలన్న పోలాండ్ విజ్ఞప్తికి ట్రంప్ నో
ట్రంప్ టారిఫ్ ల ద్వారా అమెరికాకు భారీ ఆదాయం

రష్యా దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తమ దేశంలో అమెరికా అణ్వాయుధాలను మోహరించాలి అనే పోలాండ్ అభ్యర్థనను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ విషయాన్ని Read more

APSRTC:ఏపీ ఆర్టీసీలో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్
APSRTC:ఏపీ ఆర్టీసీలో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పదోన్నతుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) Read more

Kerala: ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా పరిగెత్తించిన కంపెనీ వీడియో వైరల్
ఉద్యోగుల మెడకు గొలుసు.. కుక్కల్లా నడిపించిన కంపెనీ వీడియో వైరల్

కేరళలోని కలూర్ ప్రాంతంలో జరిగిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీస్తోంది. తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులపై ఓ ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీ వేసిన Read more

మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్..?
Manchu Manoj

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవల కుటుంబ విభేదాలతో వార్తల్లో నిలిచిన మనోజ్, ఈరోజు రంగంపేటకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా మనోజ్ Read more

×