తెలుగు యాత్రికులు ప్రయాగరాజ్ లో కుంభమేళా కు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రయాణిస్తున్న మినీ బస్సు ను లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్ లో ని జబల్ పుర్ లో జరిగిన ఘటన లో 7 మృతి చెందారు.మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతులను హైదరాబాద్ లో ని నాచారం వాసులు గా గుర్తించారు. జబల్ పుర్ లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8 .30 గంటల ప్రాంతం లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్ లోడ్ తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్ రూట్ లో రావడం తో ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సు లో చిక్కుకున్న మరికొందరిని స్థానికులు బయటకు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయం లో మినీ బస్సు లో 14 మంది ఉన్నారు. క్షత్రగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు.వీరిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ AP29W 1525 గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయ్యి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
రేవంత్ సంతాపం
ప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ,గాయపడిన వ్యక్తి కుటుంబానికి మెరుగైన వీయడం అందించాలని అధికారులను ఆదేశించారు.

రోడ్డు భద్రతపై పెరుగుతున్న ఆందోళన
ప్రతీ ఏడాది వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
డ్రైవింగ్ నియమాలను ఉల్లంఘించకపోతే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.
రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం, అతివేగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ చర్యలు & నివారణ మార్గాలు
తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.
ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం.
రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదం రోడ్డు భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుని అలాంటి ప్రమాదాలు మరల జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంభమేళా సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న 14 మంది తెలుగు యాత్రికులు ప్రయాణిస్తున్న మినీ బస్సును, రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు అందరూ హైదరాబాద్, నాచారం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.