ప్రపంచ లివర్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్, బిలియరీ సైన్సెస్ నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని హింసాకాండకు గురైన జాఫ్రాబాద్ ప్రాంతాన్ని శనివారం సందర్శించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్
న్యూఢిల్లీలోని శక్తి విహార్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనం కూలిపోయి నలుగురు చనిపోవడంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారులు
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ లో ప్రధానమంత్రి సంస్కృతిపై ప్రసంగాల సంకలనం.. సంస్కృతి కా పాంచవ అధ్యాయ్ ను ప్రారంభిస్తున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్
ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని రాంపూర్‌లో 11 యేళ్ల చెవిటి, మూగ బాలికపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై శనివారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ముంబయిలోని విలే పార్లే ప్రాంతంలో జైన దేవాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా శనివారం నిరసన ప్రదర్శన జరిపిన ప్రజలు
అస్సాంలోని నాగావ్ జిల్లాలో, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షనలకు వ్యతిరేకంగా శనివారం నిరసన ర్యాలీ నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లతో బాధపడుతున్న ప్రజలతో శనివారం మాట్లాడుతున్న జాతీయ మహిళా కమిషన్ (చైర్మన్ విజయ రహత్కర్, ఇతర అధికారులు