టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో షనీల్ డియో దర్శకత్వంలో రూపొందుతోన్న డెకాయిట్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ సినిమా అధికారికంగా ప్రకటించబడినప్పటి నుంచి టైటిల్ టీజర్ కూడా విడుదల కావడంతో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి అద్భుతమైన కథతో రాబోతున్న ఈ సినిమా గురించి అన్ని వర్గాల నుండి ఆసక్తికరమైన అభిప్రాయాలు వస్తున్నాయి ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో అడివి శేష్ కి జోడీగా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రకటించారు వైవిధ్యమైన కథాంశం తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రం కొత్త తరహా చిత్రాలలో ఒకటిగా మారబోతోందని నిర్మాతలు చెబుతున్నారు.
ఇప్పుడొస్తున్న తాజా వార్తల ప్రకారం శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు నెట్టింట పెద్దగా చర్చ సాగుతోంది ఆమె ప్రొడక్షన్ హౌస్ తో ఏర్పడిన కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా సినిమా నుండి తప్పుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వార్తల నేపధ్యంలో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ ను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పాపులర్ ఉన్న మరో కథానాయికను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనీ దీనిపై వచ్చే వారంలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఈ వార్తలు నిజం అయితే ఇప్పటివరకు శృతి హాసన్ తో షూట్ చేసిన సన్నివేశాలను మళ్లీ రీ-షూట్ చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది ఇది సినిమా నిర్మాణ ప్రక్రియలో సమయం వ్యయాన్ని మరింత పెంచే అవకాశం ఉంది కానీ నిర్మాతలు మంచి కథతో కొత్త హీరోయిన్‌ని కలిపి సినిమాను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు వచ్చిన అంచనాలను చూస్తుంటే ఈ సినిమా ఆధ్యంతం సస్పెన్స్ యాక్షన్ తో నిండిన చిత్రం అవుతుందని ఊహించవచ్చు అద్భుతమైన కథతోపాటు, ప్రముఖ నటీనటులపై ఆసక్తి కూడా సినిమాకు అదనపు బలం ఇవ్వనుంది మరి ఈ చర్చలపై నిజమెంత అనేది తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.