500కంపెనీలలో కోటి ఉద్యోగాలు..గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు: ఆర్థిక మంత్రి

Crore jobs in 500 companies..2.2 lakh crore for house construction: Finance Minister

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ బడ్జెట్ ప్రసంగాన్ని చదవుతున్నారు. చిన్న‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప‌రిశ్ర‌మ‌ల‌కు క్రెడిట్ స‌పోర్టును ప్ర‌క‌టించారు మంత్రి సీతారామ‌న్‌. ముద్రా రుణాల ప‌రిమితిని ప‌ది ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ఆమె చెప్పారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన ఆమె మాట్లాడుతూ… విజ‌య‌వంతంగా రుణాల‌ను చెల్లించిన వారికి ప‌రిమితిని పెంచుతున్న‌ట్లు ఆమె తెలిపారు. త‌రుణ్ క్యాట‌గిరీలో ఈ వెస‌లుబాటు క‌ల్పించ‌నున్నారు. ఎంఎస్ఎంఈల‌కు ట‌ర్మ్ లోన్ క‌ల్పించేందుకు.. కొత్త ర‌కం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్ కింద ప్ర‌తి ఖాతాదారుడికి వంద కోట్ల వ‌ర‌కు రుణం ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇర్రాడియేష‌న్ యూనిట్ల ఏర్పాట‌కు ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కామ‌ర్స్ ఎక్స్‌పోర్ట్ హ‌బ్స్ ను పీపీపీ మోడ‌ల్‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

కాగా, గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు కేటాయించారు. వచ్చే ఐదేండ్లలో అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని తెలిపారు. ఇక గ్రామీణ అభివృద్ధికి రూ.2.26 లక్షల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. 500 పెద్ద కంపెనీలలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని, పారిశ్రామిక వాడల్లో కార్మికుల సౌకర్యం కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని నిర్మల తెలిపారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.