పంట రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల: తెలంగాణ ప్రభుత్వం

Crop loan waiver guidelines released: Telangana Govt
Crop loan waiver guidelines released: Telangana Govt

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలపై ఇది వర్తిస్తుందని వెల్లడించింది. రైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికమని వెల్లడించింది. అంతకుముందు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… అగస్ట్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రైతుబంధు లేదా రైతు భరోసాకు సంబంధించి ఏడు వేల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు.

కాగా, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది. రైతు కుటుంబం గుర్తింపునకు రేషకార్టు ప్రామాణికమని వివరించింది. కాగా పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు.