క్రెడాయబిలిటీ..హైటెక్స్‌లో ప్రారంభమైన మొట్టమొదటి క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో

2024 ఆగస్టు 2వ తేదీ నుండి 4వ తేదీ వరకు హైటెక్స్‌లో జరుగనున్న ప్రదర్శన లో పారదర్శకత మరియు విశ్వసనీయతను కోరుకునే విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కేవలం రెరా -నమోదిత ప్రాజెక్ట్‌లను మాత్రమే ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. సిబిఆర్ఈ మరియు సీఆర్ఈ మ్యాట్రిక్స్‌తో కలిసి నగరంలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నివేదికలను ఆవిష్కరించిన క్రెడాయ్ హైదరాబాద్..

Credai Hyderabad is the first ever property show that started at Hitex

హైదరాబాద్‌: భారతదేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌ల సర్వోన్నత సంస్థ , కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్ ), ఆగస్టు 2వ తేదీ నుండి 4 ఆగస్టు 2024 వరకు హైటెక్స్‌లో # క్రెడాయబిలిటీ (#CREDAIbility) నేపథ్య ప్రాపర్టీ షోల సిరీస్‌లో మొట్టమొదటి ప్రాపర్టీ షో ను నిర్వహించబోతుంది. ఈ ప్రదర్శన లో ప్రత్యేకంగా రెరా -నమోదిత ప్రాజెక్ట్‌లను క్రెడాయ్ సభ్య డెవలపర్‌ల నుండి ప్రదర్శిస్తుంది, తద్వారా కొనుగోలుదారులకు పారదర్శకత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. దీనిని ఐజిబిసి నేషనల్ వైస్ ఛైర్మన్ శ్రీ సి శేఖర్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ శ్రీ జి రామ్ రెడ్డి, క్రెడాయ్ నేషనల్ ఇసి మెంబర్ శ్రీ సిహెచ్ రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ వి. రాజశేఖర్ రెడ్డి , ప్రెసిడెంట్‌ ఎలెక్ట్ శ్రీ ఎన్ జైదీప్ రెడ్డి, సెక్రటరీ శ్రీ బి . జగన్నాథరావు తో పాటు ఇతర క్రెడాయ్ నాయకులు, సభ్యులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు,ఐపిసి లు మరియు ఇతర విక్రేతలు పాల్గొన్నారు.

నిన్న సాయంత్రం గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మరియు పరిశ్రమలు & ఐటీ శాఖల మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు, గౌరవనీయులైన రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, శ్రీ దాన కిషోర్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ శ్రీమతి ఆమ్రపాలి కాటా మరియు హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ మరియు ఇతర ప్రముఖులు రియల్ ఎస్టేట్ పరిశ్రమకు చెందిన నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ 2050పై సీఎం తన విజన్‌ను అక్కడ పంచుకున్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు అందుబాటు ధరలలో ఉండే గృహాల నుండి అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య సముదాయాలు మొదలైన 800 కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తారు. కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా కాబోయే కొనుగోలుదారుల కోసం ఉత్తమమైన గృహ రుణాల పథకాలు అందిస్తూ ప్రాపర్టీ షోలో పాల్గొంటాయి. దీనిని అనుసరించి, తదుపరి రెండు ప్రాపర్టీ షోలు ఆగస్టు 9 నుండి 11 వరకు కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్స్‌లో మరియు ఆగస్టు 23 నుండి 25 వరకు నాగోల్ మెట్రో స్టేషన్‌లో జరుగుతాయి. ఈ వ్యూహాత్మకంగా ఎంచుకున్న స్థానాలు డెవలపర్‌లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్‌లు మరియు ఆర్థిక సంస్థలతో సహా విభిన్న శ్రేణి రియల్ ఎస్టేట్ నిపుణులకు ఆతిథ్యం ఇస్తాయి, ఈ ప్రదర్శనలు అన్ని కూడా ఈ రంగంలో తాజా పురోగతులను ప్రదర్శిస్తాయి. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024లో CBRE మరియు CRE మ్యాట్రిక్స్ ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ట్రెండ్‌లు మరియు ఔట్‌లుక్‌పై రెండు నివేదికలు కూడా ఆవిష్కరించబడ్డాయి.

“రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి చూపుతున్న మా నిబద్ధతను క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 నొక్కి చెబుతుంది” అని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ వి రాజశేఖర్ రెడ్డి అన్నారు. “మా థీమ్ #క్రెడాయబిలిటీతో, హైదరాబాద్ అందించే అత్యుత్తమ ఆస్తులను అన్వేషించడానికి గృహ కొనుగోలుదారులకు విశ్వసనీయమైన మరియు సమగ్రమైన వేదికను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అద్భుతమైన వేగంతో ముందుకుసాగుతుంది మరియు ‘బ్రాండ్ హైదరాబాద్’ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ నగరం (నైట్ & ఫ్రాంక్-సీఐఐ నివేదిక 2024) గా గుర్తింపు పొందింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ వృద్ధి కొనసాగుతోంది, ఇది నవంబర్ 2023 నుండి జూన్ 2024 వరకు 45,000 ఆస్తుల నమోదు ప్రక్రియ మరియు ఇయర్ ఆన్ ఇయర్ 8% ధరల పెరుగుదల ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, మౌలిక సదుపాయాలను పెంచడానికి మరియు హైదరాబాద్ యొక్క సర్వతోముఖాభివృద్ధిని నిర్ధారించడానికి రాష్ట్ర బడ్జెట్‌లో వారి వ్యూహాత్మక కార్యక్రమాలు మరియు గణనీయమైన పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించినందుకు మేము ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము నిన్న గౌరవనీయులైన సిఎంతో సమావేశమయ్యాము, అక్కడ ఆయన హైదరాబాద్ 2050కి సంబంధించిన విజన్‌ను వెల్లడించారు, ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి మరియు వికాసానికి తోడ్పడుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ మరియు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ (సియుఆర్)గా ప్రభుత్వం గుర్తించింది, ఇది రాష్ట్రంలోని 48.6% జనాభాను కలిగి ఉంది మరియు రాష్ట్రానికి ప్రధాన వృద్ధి ఇంజిన్. బడ్జెట్‌లో రూ. 10000 కోట్లు కేటాయించటం, ఈ ప్రాంత వృద్ధిని వేగవంతం చేయడానికి సహాయపడతాయి. అలాగే, రాష్ట్రంలో అభివృద్ధిని విస్తరించడానికి ప్రాంతీయ రింగ్‌రోడ్ అభివృద్ధికి రూ. 1,525 కోట్లు కేటాయించడం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెట్రో వాటర్ వర్క్స్ (రూ. 3,385 కోట్లు), హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ (రూ. 500 కోట్లు) మరియు ఓల్డ్ సిటీ మెట్రో పొడిగింపు ( రూ.500 కోట్లు) మరియు మల్టీ-మోడల్ రవాణా వ్యవస్థ ( రూ. 50 కోట్లు) వంటి కీలకమైన ప్రాజెక్టులకు ముఖ్యమైన నిధులు కేటాయించబడ్డాయి. పార్కులు, కమ్యూనిటీ హాళ్లు మరియు పాఠశాలలు వంటి సౌకర్యాలతో శివారు ప్రాంతాలను స్వయం సమృద్ధిగా మార్చడం స్థానిక పౌర సంస్థల నుండి ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శాటిలైట్ టౌన్‌షిప్‌లను ప్రోత్సహించడం రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన ఉత్ప్రేరకాలుగా పని చేస్తుంది” అని అన్నారు.

Mr. రెడ్డి ఇంకా మాట్లాడుతూ.. “ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ను ఏర్పాటు చేయటం కోసం రూ. 200 కోట్లు బడ్జెట్ లో కేటాయించటం తో సియుఆర్ కవర్ చేయడం తో పాటుగా ఈ ప్రాంతంలో విపత్తు నిర్వహణ కోసం ఒక సమీకృత యూనిట్‌గా పని చేస్తుంది. అలాగే, మూసీ నది క్లీనింగ్ మరియు కారిడార్ అభివృద్ధికి రూ. 1,500 కోట్లు కేటాయించడం, హైదరాబాద్‌ను ప్రగతిశీల పట్టణ కేంద్రంగా మార్చడానికి మరియు కారిడార్‌ను పర్యాటక కేంద్రంగా , ఆర్థిక జోన్‌గా మార్చడానికి, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు వారసత్వం మరియు సంస్కృతి రక్షించడానికి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించటానికి ప్రభుత్వ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారి విస్తరణ మరియు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించి, రక్షణ భూమి బదిలీకి ఆమోదం పొందేందుకు చేసిన కృషికి మేము ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాము. ఇది మెరుగైన కనెక్టివిటీని నిర్ధారిస్తుంది మరియు కంటోన్మెంట్ ద్వారా అనుసంధానించబడిన ప్రాంతాలలో వేగవంతమైన అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని మరియు ఒకే చోట నగరంలో ఉత్తమమైన ప్రాపర్టీలను ఎంచుకోవడానికి ప్రాపర్టీ షోను సందర్శించేలా ఎక్కువ మందిని ప్రోత్సహిస్తుందని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ , ప్రెసిడెంట్ – ఎలెక్ట్ శ్రీ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ , “మేము భవిష్యత్తు వైపు చూస్తున్న వేళ, క్రెడాయ్ హైదరాబాద్‌ వద్ద మా లక్ష్యం పర్యావరణం అన్నింటి కంటే ముందు ఉంది. పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన మరియు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే లక్షణాలు కలిగిన ఆస్తులను అభివృద్ధి చేయడం , నేటి అవసరాలను తీర్చడమే కాకుండా, భవిష్యత్ తరాల ప్రయోజనాలను కూడా కాపాడే గ్రీన్ బిల్డింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నది మా నిబద్దత. మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సర్వే 2023 ప్రకారం భారతదేశంలో నివసించడానికి ఉత్తమ నగరంగా, హైదరాబాద్ దాని జీవన నాణ్యతకు ప్రత్యేకంగా నిలుస్తుంది. కార్పోరేట్‌లకు ఆకర్షనీయమైన నగరంగానే కాకుండా ప్రపంచ-స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు, నగరం అత్యుత్తమ వైద్య సేవలతో అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఈ నగరం భారతదేశంలోని అత్యంత సురక్షితమైన నగరాలలో ఒకటిగా మరియు ప్రవాసులకు అత్యంత నివాసయోగ్యమైన నగరంగా రేట్ చేయబడింది అంతర్జాతీయ కమ్యూనిటీలకు స్వాగతించే వాతావరణం ఇక్కడ ఉంది. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 స్థిరమైన మరియు పచ్చని హైదరాబాద్ కోసం మా అంకితభావాన్ని ప్రతిబింబించే వినూత్న ప్రాజెక్టులు మరియు అభ్యాసాలను ప్రదర్శిస్తుంది..” అని అన్నారు.

“మేము పండుగ సీజన్‌లోకి అడుగు పెట్టడానికి ముందు ఆగస్టులో మూడు ప్రధాన ప్రదేశాలలో ‘క్రెడాయబిలిటీ’ నేపథ్యంతో కూడిన ప్రాపర్టీ షోను ప్రదర్శించడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇంటి కొనుగోలుదారులకు ప్రసిద్ధ డెవలపర్‌ల నుండి ఒకే చోట నగరంలోని ఉత్తమ రియల్ ఎస్టేట్ ఎంపికలను చేసుకోవటానికి అవకాశం అందిస్తుంది” అని క్రెడాయ్ హైదరాబాద్ సెక్రటరీ శ్రీ బి. జగన్నాథరావు అన్నారు.

“హైదరాబాద్ 6 మిలియన్ చదరపు అడుగుల లీజుకు తీసుకున్న ఆఫీసు స్థలాన్ని చేరుకోవటం తో పాటుగా 5 మిలియన్ చ.అ.ల ప్రాంగణం లీజుకు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేయబడింది. ఐటి రంగం అధికారికంగా ఈ స్థలంలో 71% సొంతం చేసుకుంది, అద్దె తక్కువగా చ.అ.కు రూ.64. గా 2023లో వుంది, హైదరాబాద్‌లో ఒక సంవత్సరంలో అత్యధికంగా 9.9 మిలియన్ చ.అ.ల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు మరియు 2024 క్యూ1లో స్థూల స్వీకరణ 3.5 మిలియన్ చ.అ.లకు చేరుకుంది. కార్పొరేట్ల నుండి ఈ ఆసక్తి , ప్రతిభావంతులు మరియు నగరంలో నివాస మరియు రిటైల్ రియల్ ఎస్టేట్ కోసం డిమాండ్ పెంచుతుంది. నైపుణ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడంతో, కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రజల కదలిక పెరుగుతుంది, గృహాలకు డిమాండ్ సైతం పెరుగుతుంది. హైదరాబాద్ 11,480 కొత్త యూనిట్లను ప్రారంభించింది మరియు Q1 2024లో మొత్తం 37.01 Mn చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ.29,473 కోట్ల విలువైన 18,253 యూనిట్ల విక్రయాన్ని నమోదు చేసింది.

భారతదేశంలోని లగ్జరీ గృహాల కోసం డిమాండ్ పరంగా టాప్ 3 మార్కెట్‌లలో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది. ‘బ్రాండ్ హైదరాబాద్’ను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన కార్యక్రమాల మద్దతుతో నివాస మరియు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో ఈ కదలిక నగరంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని నడపడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాపర్టీ షో సముచితంగా సమయానుకూలంగా నిర్వహించబడుతుంది మరియు సరసమైన గృహాల నుండి అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్‌ల వరకు హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నగరంలో అత్యంత విశ్వసనీయమైన ప్రాపర్టీలను ఒకే చోట అందజేస్తూ ప్రతి గృహ కొనుగోలుదారుకు మెరుగైన అవకాశాలను అందిస్తుంది. మేము సందర్శకులను ప్రాపర్టీ షోను సందర్శించడానికి మరియు నగరంలోని అత్యుత్తమ ప్రాపర్టీలను అన్వేషించడానికి స్వాగతం పలుకుతున్నాము . హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ రంగం గురించిన విశ్వసనీయమైన నివేదికను ప్రాపర్టీ షోలో మేము విడుదల చేస్తాము, గృహ కొనుగోలుదారులకు రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన పరిజ్ఞానం పొందడంలో మరియు నగరంలో రియల్ ఎస్టేట్ భవిష్యత్తును అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడుతుంది. ‘బ్రాండ్ హైదరాబాద్’ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం…” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2024 హైదరాబాద్‌లో అత్యుత్తమ రియల్ ఎస్టేట్ ఈవెంట్‌గా నిలుస్తుంది, ఇది అసాధారణమైన ఆస్తులను కనుగొనడానికి గృహ కొనుగోలుదారులు మరియు రియల్ ఎస్టేట్ ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఈ ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో క్రెడాయ్ హైదరాబాద్‌ను మార్గదర్శక శక్తిగా నిర్వచించే నాణ్యత మరియు ఆవిష్కరణలను నొక్కి చెబుతుంది.