Crashed fighter plane.. Injuries to the pilots

కూలిన యుద్ధ విమానం.. పైలట్లకు గాయాలు

శివపురి: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన ఈ విమానం శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు పచ్చని పొలాల్లో కూలిపోయింది. చాకచక్యంగా ఇద్దరు పైలట్లు తప్పించుకున్నారు. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. విమానం మాత్రం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్‌ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

image

ఈ విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. మిరాజ్ 2000ని ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించింది. 1978లో తొలిసారిగా ఎగిరింది. 1984లో ఫ్రెంచ్ వైమానిక దళం దీనిని ప్రవేశపెట్టింది. 600 మిరాజ్ 2000లను ఉత్పత్తి చేశారు. వీటిలో 50 శాతం భారతదేశంతో సహా ఎనిమిది దేశాలకు ఎగుమతి చేసినట్లుత డస్సాల్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

కాగా, ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ ఈ మిరాజ్ 2000 ను తయారు చేసింది. ఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ మిరాజ్ 2000ను మొట్టమొదటిసారిగా 1978లో రూపొందించింది. అయితే 1984లో ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్.. తమ సైన్యంలో ప్రవేశపెట్టింది. మొత్తంగా 600 మిరాజ్ 2000 ఫైటర్ జెట్లను తయారు చేయగా.. అందులో 50 శాతం అంటే 300 మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ సహా 8 దేశాలకు ఎగుమతి చేసినట్లు డసాల్ట్ సంస్థ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Related Posts
ప్రధానమంత్రి మోదీకి నైజీరియాలో ఘన స్వాగతం
modi nigeria

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన ప్రారంభించడానికి నైజీరియాలో అడుగుపెట్టారు. నైజీరియా రాజధాని అబూజాలో పీఎం మోదీని ఘనంగా స్వాగతించారు. నైజీరియా ఫెడరల్ క్యాపిటల్ Read more

నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్
GSLV F15

ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి GSLV-F15 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మిషన్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని Read more

Rain :ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు లో భారీ వర్షాలు
Rain :ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కర్ణాటక, తమిళనాడు లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఈదురుగాలులు వీచాయి.ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడగా, మరికొన్ని Read more

పార్టీ నేతలతో టీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్
TPCC chief Mahesh Kumar Zoom meeting with party leaders

మండల అధ్యక్షులకు దిశానిర్దేశం హైదరాబాద్‌: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల Read more