CNG Haryana

నిరాశలో కాంగ్రెస్ శ్రేణులు

హరియాణా ఎన్నికల కౌంటింగ్లో మొదట కనిపించిన ఫలితం పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్ సపోర్టర్స్ తీవ్ర నిరాశ చెందారు. తొలి అరగంటలో 50+ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉండటంతో వారంతా లడ్డూ, జిలేబీలు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ, గెలుపు గుర్రాలు బీజేపీ వైపు ఉండటంతో కాంగ్రెస్ కార్యాలయం కళ తప్పింది. ముందుగా ఏర్పాటు చేసిన డప్పు కళాకారులను తిరిగి పంపించేస్తున్నారు.

కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడింది. అధికార బీజేపీ లీడ్‌లోకి దూసుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీజేపీ అభ్యర్థులు 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఏకంగా ఏడు సంస్థల ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి 55కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ 26 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని లెక్కలుగట్టాయి. కానీ ప్రస్తుత సరళిని చూస్తుంటే ఫలితాలు భిన్నంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో కౌంటింగ్ మొదలు కాకముందే గెలుపు సంబరాలను మొదలుపెట్టిన కాంగ్రెస్ శ్రేణులు వెనక్కి తగ్గాయి. వేడుకలను నిలిపివేశాయి.

Related Posts
మమతా బెనర్జీపై ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలు
మమతా బెనర్జీపై ఆర్జీ కర్ బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అత్యాచారం మరియు హత్యకు గురైన 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ తల్లిదండ్రులు శుక్రవారం మాట్లాడుతూ, Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌- 12 మంది మావోయిస్టుల మృతి
Massive encounter in Chhatt

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య జరిగిన ఎదురు Read more

ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఫిబ్రవరి 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఫిబ్రవరి 5న జరగనుంది. ఈ సమావేశంలో కుల గణన మరియు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణపై చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం Read more

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
CM revanth reddy review with higher officials today

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *