సీఎం ఫోటో లేకుండా కాంగ్రెస్ పోస్టర్స్..BRS సెటైర్లు!

సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేసింది. అందులో డిప్యూటీ CM భట్టి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్, జాతీయ స్థాయి నేతల ఫొటోలున్నాయి. అయితే అందులో CM రేవంత్ ఫొటో లేకపోవడంతో BRS సెటైర్లు వేసింది. ‘పాపం కొరియా నుంచి తిరిగి వచ్చే లోపు రేవంత్ ఫొటో మాయం. ఆయన పదవైనా ఉందా అది కూడా ఊడిందా? కాంగ్రెస్ ఆ మజాకా!’ అంటూ రీట్వీట్ చేసింది.

అలాగే సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం ఫై హరీష్ రావు స్పందించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన ప్రతి మంచి పనిని కాంగ్రెస్‌ నేతలు తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా కరవుని పారదోలాలన్న లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మించారని, ఆ ఘనతను కాంగ్రెస్‌ విజయంగా సృష్టించుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారని, వారి ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు.

ఖమ్మం జిల్లా కరవుని పారదోలాలన్న మహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామ చంద్రుల పేరిట ప్రాజెక్టు చేపట్టారని హరీశ్​రావు తెలిపారు. ఇతరుల ఘనతను తమదిగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు పరాన్నజీవులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏడు, ఎనిమిది నెలల్లోనే అన్నీ చేసి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేశారా? అని ప్రశ్నించిన ఆయన, 30 వేల ఉద్యోగాల తరహాలోనే సీతారామ గురించి చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. సీతారామ విషయంలో నిజాలు చెప్తారన్న నమ్మకం తమకు లేదన్న ఆయన, బీఆర్​ఎస్​ విజయాలను కాంగ్రెస్​ నేతలు తమవిగా చెప్పుకునే ప్రయత్నం చేయడమే తమ నైతిక విజయమన్నారు.

పాపం కొరియా నుండి తిరిగి వచ్చే లోపు
రేవంత్ రెడ్డి ఫోటో మాయం. ఆయన పదవి అయినా ఉందా అది కూడా ఊడిందా?

కాంగ్రెస్ ఆ మజాకా! https://t.co/lUpcLxE6to— BRS Party (@BRSparty) August 12, 2024