bjp fire on congress

కాంగ్రెస్ పార్టీవీ చీప్ పాలిటిక్స్ – బీజేపీ

కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించలేదంటూ కాంగ్రెస్ చేసిన తీరు సిగ్గుచేటుగా అభివర్ణించింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి ప్రముఖులను మాత్రమే మీడియా కవరేజ్ చేసింది అనే ఆరోపణలను బీజేపీ ఖండించింది. భద్రతా కారణాల రీత్యా మీడియా కవరేజ్‌ పై నియంత్రణలు ఉన్నాయని స్పష్టంచేసింది. అంత్యక్రియల నిర్వహణలో ఎలాంటి రాజకీయం జరగలేదని బీజేపీ వెల్లడించింది.

Advertisements

అంత్యక్రియల ప్రాంగణంలో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను సైతం బీజేపీ ఖండించింది. ప్రోటోకాల్ ప్రకారం, మాజీ ప్రధానమంత్రి కుటుంబానికి ప్రథమ వరుసలో ఐదు కుర్చీలు కేటాయించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడి పేరును కూడా కాంగ్రెస్ రాజకీయ ప్రకటనల కోసం వాడుకోవడం సిగ్గుచేటని , ఇది కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు.

Related Posts
CM Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CM Chandrababu visit to Srikakulam district today

CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు Read more

మారిషస్ చేరుకున్ననరేంద్ర మోదీ
మారిషస్ చేరుకున్ననరేంద్ర మోదీ

హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశమైన మారిషస్‌తో భారతదేశానికి సన్నిహిత మరియు దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక సంబంధాలకు కారణం, 1.2 మిలియన్ల (12 లక్షలు) ద్వీప Read more

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
Maoist Bade Chokka Rao amon

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్‌ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే Read more

KCR: బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ.. పాట విడుదల చేసిన కేసీఆర్‌
KCR releases song on BRS silver jubilee

KCR : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాటను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాట రచించి Read more

Advertisements
×