bjp fire on congress

కాంగ్రెస్ పార్టీవీ చీప్ పాలిటిక్స్ – బీజేపీ

కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ మండిపడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకార్థం స్థలాన్ని కేటాయించలేదంటూ కాంగ్రెస్ చేసిన తీరు సిగ్గుచేటుగా అభివర్ణించింది. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని బీజేపీ ఆరోపించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి ప్రముఖులను మాత్రమే మీడియా కవరేజ్ చేసింది అనే ఆరోపణలను బీజేపీ ఖండించింది. భద్రతా కారణాల రీత్యా మీడియా కవరేజ్‌ పై నియంత్రణలు ఉన్నాయని స్పష్టంచేసింది. అంత్యక్రియల నిర్వహణలో ఎలాంటి రాజకీయం జరగలేదని బీజేపీ వెల్లడించింది.

అంత్యక్రియల ప్రాంగణంలో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయలేదన్న కాంగ్రెస్ ఆరోపణలను సైతం బీజేపీ ఖండించింది. ప్రోటోకాల్ ప్రకారం, మాజీ ప్రధానమంత్రి కుటుంబానికి ప్రథమ వరుసలో ఐదు కుర్చీలు కేటాయించినట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి మాటలు చెబుతున్నారని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించింది. మన్మోహన్ సింగ్ లాంటి మహానుభావుడి పేరును కూడా కాంగ్రెస్ రాజకీయ ప్రకటనల కోసం వాడుకోవడం సిగ్గుచేటని , ఇది కాంగ్రెస్ దుస్థితికి నిదర్శనమని మండిపడ్డారు.

Related Posts
అంగుళం భూమి విషయంలోనూ రాజీపడేది లేదన్న మోడీ
modi

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్రంలోని కచ్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంలో, భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన చర్యల గురించి Read more

బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లకు రాజ‌కీయ పార్టీల అండ‌: ప్ర‌ధాని మోడీ
Political parties support urban Naxalites.. PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అడవుల్లో నక్సలిజం క్రమంగా అంతమవుతోందని, దురదృష్టవశాత్తూ పట్టణాలు, నగరాల్లో వేగంగా పాతుకుపోతోందని అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన Read more

దివ్యాంగ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
disabilities students

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం తీసుకుంది. ఇది Read more