Congress Haryana in charge resigns

కాంగ్రెస్ హర్యానా ఇన్‌చార్జ్ రాజీనామా

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హర్యానా ఇన్‌చార్జ్ దీపక్ బబారియా తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానానికి రాజీనామా లేఖను సమర్పించినట్టు తెలిపారు. అయితే, హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదని పేర్కొన్నారు.

ఫలితాలు భిన్నంగా వచ్చిన తర్వాత రాజీనామా చేస్తానని ప్రకటించానని, తన స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చని అధిష్ఠానాన్ని చెప్పినట్టు బబారియా తెలిపారు. అరోగ్య కారణాలతోపాటు ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తున్నానని, ఎవరైనా ఈ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటే వారిని నియమించాలని కోరినట్టు చెప్పానని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పుడు కూడా రాజీనామా చేస్తానని చెప్పినా దానిపైనా అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేసుకున్నారు. హర్యానాలోని 90 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది.

Related Posts
భారత్ ప్రకటన తర్వాత వలసలపై ట్రంప్ నిర్ణయం?
భారతదేశానికి ట్రంప్ అనుకూలమేనా?

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే తన దేశంలో అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పనిలో పనిగా తన దేశానికి పనికొచ్చేలా ఈ వ్యవహారాన్ని మార్చుకుంటున్నారు. Read more

26/11 ముంబై దాడి నిందితుడు అప్పగింతకు ట్రంప్ అంగీకారం
Trump agrees to extradite 26/11 Mumbai attack suspect

భారత్‌కు తహవూర్‌ రాణా అప్పగింత – కీలక ముందడుగు భీకర ముంబయి ఉగ్రదాడి మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలు. అమెరికా అనుమతితో భారత్‌కు న్యాయపరమైన Read more

మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్
Sunita Williams to land in

అనివార్య సాంకేతిక సమస్యల కారణంగా 8 నెలలుగా అక్కడే భారత సంతతికి చెందిన NASA ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి రానున్నారు. Read more

కశ్మీర్‌లో విద్యుత్ లోటు: ఇండస్ వాటర్ ఒప్పందం పై విమర్శలు
kashmir power cut

కశ్మీర్‌లో ప్రజలు ఎదుర్కొనే శాశ్వత విద్యుత్ విరామాలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. ముఖ్యంగా చలికాలంలో నీటి స్థాయిలు పడిపోవడం వలన, ఈ సమస్య తీవ్రతరంగా ఏర్పడింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *