ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తెలంగాణ సర్కార్

జులై 25న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె. రామకృష్ణారావు తెలిపారు. సుమారు రూ.2.85లక్షల కోట్లతో పద్దును రూపొందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తి బడ్జెట్‌ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్​లో ఆరు గ్యారంటీలు, ప్రభుత్వ ప్రాధాన్యాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు. ఈ నెల 25వ తేదీన ఉభయసభల్లో ప్రవేశపెట్టడాని ప్రభుత్వం సిద్దమైంది.

ఇప్పటికే అన్ని శాఖలతో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా శాఖల వారీగా కేటాయింపులకు సంబంధించి దాదాపు స్పష్టత ఇవ్వగా, వాటి ఆధారంగా ఆయా శాఖల పద్దులు ఉండనున్నాయి. బడ్జెట్‌లోని నిర్వహణా పద్దులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోగా, ప్రగతి పద్దులో మాత్రమే కొంత మేరకు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు, చేర్పులు ప్రతిపాదించారు.