రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ గురించి కాంగ్రెస్ అర్థం చేసుకోలేదని ఎద్దేవా చేశారు.సమాజంలో కాంగ్రెస్ కులమత ద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు . ఈ క్రమంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై చర్చించిన క్రమంలో పేర్కొన్నారు. మా విధానాలలో “నేషన్ ఫస్ట్” అనే స్ఫూర్తిని పరిగణించామని పేర్కొన్నారు. 2014 తర్వాత దేశం ఒక కొత్త నమూనాను చూసిందని చెప్పారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాలు అందరినీ మోసం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు.
2014లో మా ప్రభుత్వం ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధికి మేము ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఆ క్రమంలో మొదటిసారి వ్యాపారంలోకి వస్తున్న వారికి ముద్ర పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండా రుణం ఇస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ ను కాంగ్రెస్ ఎప్పుడు గౌరవించలేదని, ఎన్నికల్లో ఆయనను ఓడించడానికి అనేక కుట్రలు పన్నారని తెలిపారు.ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించి ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని ఆరోపించారు.