స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతి: 2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని జపాన్ కు చెందిన నేషనల్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. 2014-19 మధ్య జరిగిన అతిపెద్ద కుంభకోణం అమరావతి భూముల స్కామ్. అమరావతి కోసం 34వేల ఎకరాలు సేకరించారు. 1843 అసైన్డ్ భూములు ఆక్రమించారు. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం. అమరావతి కుంభకోణం పై ఎంక్వైరీ జరిగింది. మీకు చేతనైతే ఆ ఎంక్వైరీ బయటపెట్టండి.

Advertisements
స్కిల్ డెవలప్ మెంట్‌లో విచారణ జరిపించండి: వైసీపీ ఎమ్మెల్సీ

అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో విచారణ జరిపించండి. విచారణకు సహకరించకుండా అప్పటి ముఖ్యమంత్రి పీఏని దేశం దాటిం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కొందరు మంత్రులు బినామీల పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు ఖర్చు చేశారు. ఈ తాత్కాలిక భవనాల నిర్మాణంలో పెద్ద స్కామ్ జరిగింది. గట్టిగా వర్షం వస్తే ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని చెప్పారు. ప్రధానితో ఆ మాట అనిపించుకోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా.. మీకు ధైర్యముంటే గత విచారణను బయటపెట్టి మాట్లాడండి అని వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.

Related Posts
మంచం కావాలని కోరిన వల్లభనేని వంశీ… కుదరదన్న జైలు అధికారులు
విజయవాడ జైలులో వల్లభనేని వంశీ ప్రవర్తనపై వివాదం

విజయవాడ జిల్లా జైలుకు తరలించబడిన తరువాత, వల్లభనేని వంశీ తన ఆరోగ్యంపై గంభీరంగా ఆందోళన వ్యక్తం చేశారు. తనకు నడుం నొప్పి ఉందని మంచం కావాలని పట్టుబట్టారు. Read more

రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు
Rahul Gandhi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్యలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శించారు. రాహుల్ గాంధీ, Read more

జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల
జగన్ విద్యుత్ రంగాన్ని నాశనం చేసారు : నిమ్మల

జగన్ ఐదేళ్ల అరాచక పాలనతో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి ప్రజలపై భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై Read more

బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్
బీజేపీ ఢిల్లీని ద్వేషిస్తుంది: కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీ ఢిల్లీని "భారతదేశ నేర రాజధాని"గా మార్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం బీజేపీపై తీవ్రంగా విమర్శలు Read more

×