సినీ దర్శకుడు గీతాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

సినీ దర్శకుడు గీతాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

వివిధ చానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేసిన సినీ దర్శకుడు గీతాకృష్ణ గీతాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్టణం ఉమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (వావా) సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీకి ఫిర్యాదు చేశారు. గీతాకృష్ణ అక్కయ్యపాలెంలో గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్, హైదరాబాద్ మాదాపూర్‌లో మరో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ నడుపుతున్నారు. ఇటీవల వివిధ చానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన సినిమాల్లో నటించే మహిళలపై అసభ్యకర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ కోరారు.

సంచలన కామెంట్స్

గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాలపై షాకింగ్ కామెంట్స్, చేశారు. ధనవంతులు పిల్లలే డ్రగ్స్ వాడుతారని, సాధారణ ప్రజలకు ఆదేంటో తెలియదని అన్నారు. ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని పేర్కొన్నారు.సినీ పరిశ్రమలో చాలామంది డ్రగ్స్‌కు బానిసలైపోయారని పేర్కొన్నారు. అంతేకాదు, హీరోయిన్లు రొమాంటిక్ సీన్లను స్వచ్ఛందంగా చేయరని,వ్యాఖ్యానించారు. రూ. 50 లక్షలు ఇస్తే హీరోయిన్లు గెస్ట్‌హౌస్‌కు వెళతారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

geetha krishna 2 png 363x203xt

ఈ వ్యవహారంపై విశాఖ విమెన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, గీతాకృష్ణ సినీ పరిశ్రమలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే వారిని ఉపేక్షించకూడదని వారు తెలిపారు. ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు, గీతాకృష్ణపై విచారణ చేపట్టినట్లు సమాచారం.ఇదే కాకుండా, సమయం చిక్కినప్పుడల్లా సినీ ఇండస్ట్రీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో గీతాకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్న వావా సభ్యులు, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts
దూసుకుపోతున్న నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే కథ
MURA film still

ఈ వారం మలయాళంలో విడుదలైన ఆసక్తికర చిత్రాలలో 'మురా' ఒకటి. విడుదలకు ముందే తన టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం, థ్రిల్లింగ్ కథనంతో Read more

‘థగ్ లైఫ్’ ఈ తేదీన విడుదల కానుందా
Thug Life

సమస్త తెలుగు చిత్రపరిశ్రమలో మణిరత్నం మరియు కమల్ హాసన్ కలయికకు ప్రత్యేక స్థానం ఉంది. వారి ఆఖరి చిత్రమైన 'నాయకన్' తర్వాత, ఈ జంట మళ్లీ చలనచిత్ర Read more

తాతగారి విగ్రహం ముందు మా పెళ్లి.. శోభిత నాగచైతన్య?
naga chaitanya sobhita

నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల పెళ్లి విషయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రేమలో మునిగిపోయిన ఈ జంట ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకుంది. ప్రస్తుతం వారి వివాహానికి Read more

indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారతీయులు చిక్కులోఅంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా కేసులో ముగ్గురు తమిళనాడుకు చెందిన భారతీయులు ఇండోనేషియాలో అరెస్టు అయ్యారు. 106 కిలోల డ్రగ్స్ తరలిస్తుండగా Read more