Hydra Commissioner AV Ranganath

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధభవన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హైడ్రా ఏర్పాటైన మొదట్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన రాగా.. ప్రస్తుతం హైడ్రా కార్యాలయానికి జనాలు క్యూ కడుతుండటం గమనార్హం. నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలపై ఆయా ప్రాంతాల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు రావటం గమనార్హం.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. సందర్భంగా వైసీపీకి చెందిన ఓ మహిళా నేత.. మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‎ అమీన్‌పూర్‎లోని 193 సర్వే నంబర్‎లో ఉన్న తన భూమిని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, రమేష్ అనే వ్యక్తి.. ఇద్దరు కలిసి కబ్జా చేశారని బాధితురాలు హైడ్రా కమిషనర్‎కు కంప్లైంట్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని.. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే కబ్జాకు గురైన తమ లేఅవుట్ ప్లాట్లు, రోడ్లు విడుదల అయ్యాయని.. కానీ ఇంకా చాలా ప్లాట్లు నీళ్లలో మునిగే ఉన్నాయని.. నాలాను మూసేసి నీళ్లు వెళ్లకుండా చేయడమే ఇందుకు ప్రధాన కారమణమని ఆమె పేర్కొన్నారు. అయితే.. రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలపై హైడ్రా ఇప్పటికే బుల్డోజర్ ఎక్కుపెట్టింది.

Related Posts
నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన కొండా సురేఖ
surekha

నర్సాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గల నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ ల మంత్రి కొండా సురేఖ సందర్శించారు Read more

పీసీసీ చీఫ్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
MLC candidates meet PCC chief

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి Read more

‘అదానీ-రేవంత్ భాయ్ భాయ్’ టీషర్ట్ తో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు
KTR Assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 'అదానీ-రేవంత్ భాయ్ భాయ్' అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. Read more

అల్లుఅర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన
revanth reddy 292107742 16x9 0

శుక్రవారం ఉదయం జరిగిన సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *