commercial gas cylinder pri

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

commercial gas cylinder price hike
commercial gas cylinder price hike

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.

ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి, ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.

ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.

Related Posts
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కోసం మోదీకి లేఖ: కాంగ్రెస్

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం కావాలని ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ప్రత్యేక స్మారక స్థలాన్ని Read more

మన్మోహన్ గొప్ప దార్శనికుడు : మాజీ రాష్ట్రపతి
Ram Nath Kovind mourns the death of Manmohan Singh

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. మన్మోహన్‌ సింగ్‌ భారత ఆర్థిక వ్యవస్థకు రూపశిల్పి Read more

ఆశారాంకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు
asaram bapu

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు Read more

అల్లుఅర్జున్‌ను కలిసిన చిరంజీవి సతీమణి సురేఖ
surekha alluarjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం శనివారం ఉదయం తన మేనత్త, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బన్నీ జైలు Read more