Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

Assembly :అసెంబ్లీ కి రాని ఎమ్మెల్యే ల పై రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా జీతం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం పై మాట్లాడారు.

Advertisements

వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శలు

అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించేందుకు, పాలనలో పారదర్శకత తీసుకురావడానికే ఏర్పాటు చేయబడతాయి.అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా, కేవలం హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసుకుని వెళ్లిపోవడం ప్రజాస్వామ్యానికి తగదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైసీపీ సభ్యులు కొంత మంది అసెంబ్లీలో కనిపించకుండా రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు చేశారు,అని చంద్రబాబు తెలిపారు.గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం ప్రజల పక్షాన పని చేయకపోవడమే అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.ధైర్యంగా సభకు రాలేరా? దొంగల్లా వచ్చి సంతకాలు చేయడం ఎందుకు,అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు.

కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా, ప్రజల సొమ్ముతో జీతం తీసుకోవడం తగదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకుని అసెంబ్లీకి రావడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని విమర్శించారు.ప్రజల సొమ్ము జీతంగా పొందుతున్న కేసీఆర్ అసెంబ్లీకి సమావేశాలకు వచ్చి తెలంగాణ అభివృద్ధికి సలహాలు ఇవ్వకుండా హౌస్‌లో ఉండిపోవడం సమంజసమా అని రేవంత్ ప్రశ్నించారు.

chandrababu revanth reddy 2024 09 e590a2aea8da4a7b35eb040ff1651af3

ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల హాజరు అవసరమే

ఎమ్మెల్యేలు ప్రజల సేవకులు.ప్రజల కష్టాలు పరిష్కరించడానికి, పాలనలో చురుకుగా పాల్గొనడానికి అసెంబ్లీలో హాజరు కావాల్సిందే.ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడమేంటని రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులు భవిష్యత్‌లోనైనా ఈ తీరును మార్చుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రజా ప్రతినిధుల బాధ్యత

ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా,ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం తప్పనిసరి. ప్రజల కట్టే పన్నుల నుంచే వీరు జీతం తీసుకుంటారు, అందుకే సభకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలి.

Related Posts
Pawan kalyan: గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్
గత ప్రభ్యుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు: పవన్‌ కల్యాణ్

కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ఆయన పంట కుంట నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల Read more

వైసీపీ పై మంత్రి మనోహర్ విమర్శలు
వర్మ వ్యవహారం టీడీపీ అంతర్గతం: నాదెండ్ల మనోహర్

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు Read more

ఒక్కసారైనా జై తెలంగాణ అన్నావా..రేవంత్ – హరీష్ రావు
harish revanth

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more

IRCTC: ఐఆర్​సీటీసీ స్పెషల్ ప్యాకేజీతో హాయిగా శ్రీవారి దర్శనం
IRCTC: ఐఆర్​సీటీసీ స్పెషల్ ప్యాకేజీతో హాయిగా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా, ప్రత్యేక దర్శన టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో, అనేక మంది భక్తులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×