సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన రద్దు ప్రచారం ఫై CMO క్లారిటీ

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు అయిందని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సీఎంఓ ఖండించింది. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని.. ఆకస్మికంగా ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తెలిపింది.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ అమెరికా లో బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.