డీఎస్సీ అభ్యర్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

CM Revanth Reddy will visit Mahabubnagar today

డీఎస్సీ అభ్యర్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుండి ఆగస్టు నెల 5 వరకూ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు 2లక్షల 79 వేల 957 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 2017 తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న డీఎస్సీ పరీక్షలు ఇవే కావడం గమనార్హం. రెండు సెషన్లలో డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు ఒక సెషన్.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4:30 వరకూ రెండో సెషన్ జరగనుంది. ఒక్కో సెషన్ లో 13,000 మంది చొప్పున రెండు సెషన్లకు కలిపి రోజుకు 26,000 మంది డీఎస్సీ అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. నేటి నుండి ఆగస్టు 5 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలకు హాజరవుతోన్న అభ్యర్ధులకు నా శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. అలాగే 2012 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు జరుగుతోన్న ఈ డీఎస్సీ ద్వారా మీ కలలు ఫలించాలని అన్నారు. ఇక భావి భారత పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.