ఏపీకి స్థిరాస్తులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు విభజన అంశాల పరిష్కారంపై చర్చించారు. 10 ఏళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిపై రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రులతో ఓ కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని రెండు రాష్ట్రాల సీఎంలు డిసైడ్ చేసారు.

అలాగే ఏపీకి స్థిరాస్తులు ఇవ్వాలని కోరగా సీఎం రేవంత్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 5 గ్రామాలు మనకే ఇవ్వాలని అడిగామన్నారు. తెలంగాణలో ఉన్న భవనాలన్నీ తెలంగాణకే. స్థిరాస్థులు ఏమీ ఇచ్చేది లేదని చెప్పినట్లు తెలిపారు. పదేళ్లుగా చాలా అంశాలు పరిష్కరానికి నోచుకోలేదని, వాటిని పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయాలని నిర్ణయించినట్లు భట్టి తెలిపారు.