CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

నేడు రంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో ఆనవాయితీగా నాగర్‌ కర్నూల్ జిల్లాలోని సొంతూరు కొండారెడ్డిపల్లెలో, ఆ తర్వాత ఆయన నియోజకవర్గం కొడంగల్‌లో సీఎం పర్యటించిన విషయం తెలిసిందే.

కొడంగల్ పర్యటన అనంతరం నిన్న (ఆదివారం) మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న రేవంత్ నేరుగా బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యకమంలో పాల్గొని ప్రసంగించారు.

కాగా.. ఈ రోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కొంగరకలాన్‌కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. అక్కడ ఫాక్స్‌కాన్ కంపెనీ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే 2023లో ఫాక్స్‌కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది. కొంగర్‌కలాన్‌లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు అప్పట్లో ఫాక్స్ కాన్ సీఈఓ యంగ్ లియు వెల్లడించారు.

Related Posts
శివపూజలో కార్తిక పౌర్ణమి ప్రత్యేకత:శివ లింగానికి పూజ చేసి పుణ్యం పొందండి
siva lingam 2

కార్తిక పౌర్ణమి రోజున శివారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శివుని పూజ చేయడం ద్వారా శరీర, మనసు, ఆత్మ దుర్గములు, పాపాలు దూరమవుతాయి. కార్తిక Read more

ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్పై బండి సంజయ్ డిమాండ్
ఆరోగ్యశ్రీ, ఫీ రీయింబర్స్మెంట్ పై బండి సంజయ్ డిమాండ్

ఆరోగ్యశ్రీ మొత్తాన్ని చెల్లించకపోవడం వలన, పేదలు, నిరుపేదలకు నెట్వర్క్ ఆసుపత్రుల నుండి ఆరోగ్య సేవలు అందట్లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం Read more

టెట్ ఫ‌లితాలు విడుదల .
tet results

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు Read more

పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు
పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు

తమిళనాడులో ఒక పానిపూరి విక్రేత తన ఆన్లైన్ చెల్లింపులు ఒక సంవత్సరంలో 40 లక్షల రూపాయలను దాటిన తర్వాత జీఎస్టీ నోటీసు అందుకున్నాడు. ఈ పానీపూరి విక్రేతకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *