CM Revanth Reddy visit to Chennai

CM Revanth Reddy : చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్ నేతృత్వంలో శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం చెన్నై వెళ్లారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భేటీకి స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో అఖిలపక్షం సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరే వరకూ అటు ఇరు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నాయి.

Advertisements
చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ

కాగా, కేంద్రప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టబోతోంది. అయితే ఈ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, హక్కులు దెబ్బతింటాయని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. పునర్విభజన జరిగితే 1971 జనాభా లెక్కల ఆధారంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణలు జరగాలని అంటున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైకు రావాలని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం చెన్నై వెళ్లింది.

Related Posts
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం

దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) సదస్సులో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ను గూగుల్ క్లౌడ్ వంటి సాంకేతిక సంస్థలకు వ్యూహాత్మక కేంద్రంగా Read more

APలో బర్డ్ ఫ్లూ భయం – కోడి మాంసం తినడం సురక్షితమేనా?
బర్డ్ ఫ్లూ భయం – ఏపీ ప్రభుత్వం ప్రజలకు జారీ చేసిన జాగ్రత్త సూచనలు!

బర్డ్ ఫ్లూ కలకలం: ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పక్షుల Read more

లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్
లాలూ ప్రతిపాదనను తిరస్కరించిన నితీష్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జెడి (రాష్ట్రీయ జనతాదళ్) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆయన, గతంలో రెండు సార్లు పొరపాటున దారి తప్పినప్పటికీ, Read more

Bullet train: కొత్త బుల్లెట్ రైలు మార్గం ఎక్కడినుండి అంటే?
Bullet train: కొత్త బుల్లెట్ రైలు మార్గం ఎక్కడినుండి అంటే?

భారతదేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్: ప్రజలకు కొత్త ప్రయాణ అనుభవం భారత రైల్వే వ్యవస్థలో గత కొంత కాలంగా జరిగిన విప్లవాత్మక మార్పులు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×