saddula bathukamma

ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ..సీఎం రేవంత్ హాజరు

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్లగొననున్నారు. కాగా.. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts
6 నుంచి తెలంగాణలో కులగణన
kulaganana

తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6 నుండి కులగణనను ప్రారంభించాలని నిర్ణయించడం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని Read more

మాట్ గేట్జ్ వివాదం తరువాత, పామ్ బోండి ని అటార్నీ జనరల్ గా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
pam bondi

డొనాల్డ్ ట్రంప్, తన అటార్నీ జనరల్ పథవికి ఫ్లోరిడా రాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ పామ్ బోండి ని నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనను, మాజీ Read more

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్
AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా Read more

రైతుల కోసం జైలుకు పోవ‌డానికి నేను సిద్ధం – కేటీఆర్
ktr jail

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *