CM Revanth Reddy participated in Cyber

డీప్ ఫేక్‌తో సమాజంలో చిచ్చు : సీఎం రేవంత్

హైదరాబాద్‌: హైదరాబాద్ లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సైబర్ సేఫ్టీ లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో చూడాలి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల ఆర్థిక వ్యవస్థ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెలంగాణ ను సురక్షిత బిజినెస్ హబ్ గా చూడాలి. 1930 టోల్ ఫ్రీ నెంబర్ పై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.. పోలీసులు కూడా మరింత అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనది. నేరాల రూపు మరింత మారుతోంది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిపాలన లో కూడా మార్పు రావాలి.పోలీసులు కూడా మరింత అవగాహన కల్పించాలి.డీప్ ఫేక్‌తో సమాజంలో చిచ్చు : సీఎం రేవంత్.

డీప్ ఫేక్‌తో  సమాజంలో చిచ్చు

ఒక్క క్లిక్ తో నిలువునా దోచేస్తున్నారు..

ఒకప్పుడు దోపిడీ చేయాలి అంటే.. దొంగలు తలుపులు బద్దలు కొట్టి మన ఇంట్లోకి ప్రవేశించాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న దోపిడీ.. అలా కాదు. ఒక్క క్లిక్ తో నిలువునా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ సేఫ్టీ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. కేంద్రం కూడా గుర్తించి అవార్డులు ఇచ్చింది. కానీ.. ఇది సరిపోదు. ఇక డీప్ ఫేక్ తో.. సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. దేశం మొత్తం ఒక కో ఆర్డినేషన్ తో సైబర్ నేరాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలకు నియంత్రించడంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నా అని సీఎం పేర్కొన్నారు.డీప్ ఫేక్‌తో సమాజంలో చిచ్చు : సీఎం రేవంత్.

సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు

డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సైబర్ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణను సురక్షిత రాష్ట్రంగా మారుస్తామన్న సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Related Posts
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్

స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల కార్యక్రమంలో పాల్గొని, తన కెరీర్ విషయంతో పాటు భారతదేశంలో హిందీ భాష స్థితిగతులపై వ్యాఖ్యలు చేసి Read more

‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
game changer talk

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కలయికలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. ఈ మూవీ లో రామ్ చరణ్ Read more

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి ఛైర్మన్ గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా వి. నారాయణన్ నియమితులయ్యారు, మంగళవారం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం. ప్రస్తుత Read more

స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వేపై అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫ‌రెన్స్
CSMeeting

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను పర్యవేక్షించడం, సర్వే Read more