కవిత బెయిల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ రావడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..బిజెపి , కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పలు రకాలుగా స్పందించగా..తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుండడంతో కవిత బయటకు వచ్చిందని ఆరోపించారు. ఈ కేసులో అరెస్టైన కేజ్రీవాల్, సిసోడియాకు చాలా కాలం బెయిల్ రాకపోవడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

అలాగే హైడ్రా పై కూడా రేవంత్ పలు వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అని . తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యం అని తెలిపారు. ప్రజా ప్రయోజనాలు తమకు ముఖ్యం.. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు. ఓఆర్‌ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలో ఉన్నాయని అన్నారు. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని చెప్పారు.